HomeDevotionalనిర్మల్ జిల్లా బాసర..ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్ జిల్లా బాసర..ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం,
(ఆరవ రోజు)
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా, ఆరవ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

అమ్మవారి స్వరూపం బంగారు వన్నెతో ప్రకాశించే దివ్య మంగళ స్వరూపంతో, నాలుగు భుజాలు కలిగి అభయ, వరద ముద్రలతో పాటు ఖడ్గం, పద్మం ధరించి సింహవాహినియై భక్తులను అనుగ్రహిస్తున్నారు.

ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా రవ్వ కేసరి మరియు అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించారు

బాసర క్షేత్రంలో నవరాత్రి వేడుకలకు విచ్చేస్తున్న వేలాది మంది భక్తులకు దేవస్థాన అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సిబ్బంది ఎప్పటికప్పుడు పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తూ తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు ఎంతో ప్రశాంతంగా సాగుతున్నాయి

ఈరోజు మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావటంతో అధిక సంఖ్యలో పోటెత్తిన భక్తులు

అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు క్యూ లైన్ లో అమ్మవారికి దర్శించుకుంటున్నారు

అమ్మవారి అక్షరాభ్యాస పూజకు రెండు గంటల సమయం దర్శనానికి గంట సమయం పడుతుంది
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటుచేసిన ఆలయ అధికారులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments