HomeCRIMEభార్య, మామపై కత్తితో దాడి..వినాయక్‌నగర్‌లో అర్ధరాత్రి ఘటన..

భార్య, మామపై కత్తితో దాడి..వినాయక్‌నగర్‌లో అర్ధరాత్రి ఘటన..

కుటుంబ కలహాలు కత్తిపోట్లకు దారితీశాయి. వినాయక్‌నగర్‌లో వైద్యనాథ్‌ అనే వ్యక్తి తన భార్య పూజ, మామ మోహన్‌పై కత్తితో దాడి చేశాడు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో పూజ రెండు నెలలుగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైద్యనాథ్‌ అర్ధరాత్రి అనూహ్యంగా ఇంటికి వచ్చి భార్యతో పాటు మామ మోహన్‌పై కత్తితో దాడి చేసినట్లు తెలిసింది.

ఈ ఘటనలో 70 ఏళ్ల మోహన్‌ తీవ్రంగా గాయపడ్డాడు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments