HomeCRIMEవడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు..సీపీ సాయి చైతన్య ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు..

వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు..సీపీ సాయి చైతన్య ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు..

ఏడు ప్రాంతాల్లో తనిఖీలుఅధిక వడ్డీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వడ్డీ వ్యాపారులపై నిజామాబాద్‌ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే దాడులు ప్రారంభించారు.

భీమ్‌గల్‌, బాల్కొండ, సిరికొండ, ధర్పల్లి, రుద్రూర్, బోధన్‌, వేల్పూరు పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపడుతున్నారు.అధిక వడ్డీల వసూళ్లు, రుణగ్రహీతల వేధింపులు, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వ్యాపారాలపై పోలీసులు దృష్టి సారించారు.

వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలను పరిశీలిస్తూ, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సాగుతున్న ఈ దాడులతో వడ్డీ వ్యాపారుల్లో కలవరం మొదలైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments