గ్రామంలో ఆదివారం నిర్వహించనున్న బతుకమ్మ పండుగ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరుకావాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్లను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మైలారం ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ వార్డు సభ్యులు కుమ్మరి శేఖర్, గుడాల అరుణ్ కుమార్ ముదిరాజ్, కొండే సాయికిరణ్ యాదవ్ తదితరులు ఇరువురు ప్రముఖులను వారి నివాసాల్లో కలిసి, వట్టినాగులపల్లి గ్రామంలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
ఈ ఆహ్వాన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మైలారం ప్రదీప్ కుమార్, మాజీ వార్డు సభ్యులు కుమ్మరి శేఖర్, గుడాల అరుణ్ కుమార్ ముదిరాజ్, కొండే సాయికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
