ప్రజాక్షేత్రంలో ప్రజాసమస్యల మీద పోరు చేయాల్సిన గులాబీ నేతలు ఇంకా అధికార మత్తులో ఉన్నారు.వారి ఆగడాలు ఇంకా అదుపులో కి రావడం లేదు అధికారులఅండ చూసుకొని ఇంకా అరాచకాలు సాగిస్తున్నారు. ఓ రేకుల షెడ్ ను అక్రమంగా వేసారనే నెపంతో గులాబీ నేత రాత్రికి రాత్రే స్థానిక పోలీసులను మేనేజ్ చేసుకొని కూల్చేయడం కలకలం రేపింది.
ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లలితాంబ ఆలయం సమీపంలో లలితానగర్ లో ఒక స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని కొన్నేళ్లుగా ఓ కుటుంబం నివాసముంటోంది.సదరు నిర్మాణం అక్రమమే అయినప్పటికీ.. దాన్ని తొలగించాల్సిన అధికార యంత్రాంగం అక్కడ లేదు.
ఎలాంటి నోటీసులూ లేవు! కనీసం ఇంట్లో ఉన్న సామాన్లను కూడా బయటకు తీసుకునే అవకాశం లేకుండా,నేరుగా జేసీబీని దింపి వస్తువులన్నీ మట్టిపాలయ్యేలా దౌర్జన్యంగా రాత్రికి రాత్రే రంగంలోకి దిగి రేకుల షెడ్డును నేలమట్టం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇంట్లో ఉన్న నిత్యావసరాలు, బట్టలు, ఇతర సామాన్లను బయటకు తీసుకునే కనీస సమయాన్ని కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే అంతా నేలమట్టం చేశారు.
పొద్దున్నే వచ్చి చూసుకున్న ఆ కుటుంబ సభ్యులు తమ గూడు ధ్వంసమై, వస్తువులన్నీ మట్టిలో కలవడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎలాగో ముందే పోలీసులను మేనేజ్ చేసుకొని సదురు నేత కూల్చివేసారట అందుకే బాధితులు ఇచ్చిన పిర్యాదు ను పోలీసులు లైట్ తీసుకున్నారు.
కొద్దీరోజుల క్రితమే ఇదే ప్రాంతంలో సబ్ రిజిస్టర్ ను బిఆర్ యస్ నేత నేరుగా ఇంటికి వెళ్లి బెదిరించడం తో సీపీ చొరవ తో కేసు నమోదు అయింది. ఆ కేసు లోను బిఆర్ యస్ నేతలు నేరుగా స్టేషన్ కు వెళ్ళి వ్యవహారం చక్కబెట్టారు అధికారంలో లేక పోయిన కింది స్థాయి లో అధికారులను మేనేజ్ చెయ్యడం గులాబీ నేతలకు సులువుగా మారింది
