తమ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అప్రతిష్ఠపాలు చేస్తు సోషియల్ మీడియా లో పోస్టు లు పెడుతున్న వారిమీద చర్యలు తీసుకోవాలని యం యంఐయం నేతలు సీపీ ని కోరారు. మహమ్మద్ ముజీబ్ అహ్మద్ అలియాస్ షైబాజ్ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ లు సీపీ ని కల్సి ఫిర్యాదు చేశారు.
నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు సంబంధిత డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని కోరారు. ఎంఐఎం టౌన్ జనరల్ సెక్రటరీ, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యుడైన ముజీబ్ అహ్మద్ అక్టోబరు 24న అయిదో టౌన్ పోలీసుస్టేషన్ లో పిర్యాదు చేసారు .
షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతా, వాట్సాప్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు, అభ్యంతరకర సమాచారాన్ని పదేపదే ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ నెల 20న కాషాయ దుస్తులు, పూలమాలతో ఉన్న వ్యక్తి చిత్రాన్ని మార్ఫింగ్ చేసి బీజేపీ, ఎంఐఎం మధ్య పొత్తు ఉన్నట్లు ప్రచారం చేశారని ఆరోపించారు.
దీనివల్ల ప్రజలు తప్పుదోవ పట్టడమే కాకుండా అసదుద్దీన్ ఒవైసీ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. అలాగే మే 7న అసదుద్దీన్ ఒవైసీ, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీల ముఖాలను కుక్క చిత్రానికి జతచేసి, పక్కన ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఉంచి అవమానకరంగా ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో వివరించారు.ఇలాంటి మార్ఫింగ్ ఫొటోలపై జూన్ 20న గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ, మళ్లీ ఇలాంటి పోస్టులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ తరహా ప్రచారం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచి, తప్పుడు సమాచార వ్యాప్తికి, మత సామరస్యానికి, ప్రజా శాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ ను అలాగే ఐదవ టోన్ ఎస్సై సునీల్ ను కలిసి ఫిర్యాదు అందజేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అని తెలిపారు.
సంబంధిత ఫేస్బుక్ పోస్టులు, ఫొటోలు, వీడియోలు, యూఆర్ఎల్లు, టైమ్స్టాంప్లు, వాట్సాప్ సందేశాలు తదితర డిజిటల్ ఆధారాలను సేకరించి పరిశీలించాలని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపి, నేరం నిర్ధారణకు అవసరమైన ఆధారాలు లభిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
