మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని డిచ్పల్లి మండలానికి కేటాయించి, బంజారా మహిళా నాయకురాలు, మాజీ కార్పొరేటర్ చంగుబాయికి అవకాశం కల్పించాలని మండలంలోని బంజారా సర్పంచులందరూ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కోరారు.
మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండలానికి చెందిన బంజారా సర్పంచులందరూ కలిసి ఎమ్మెల్యేను కలిసి తమ అభ్యర్థనను తెలియజేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి డిచ్పల్లి మండలానికి దక్కేలా చూడాలని, ఆ పదవికి చంగుబాయి పేరును పరిశీలించాలని కోరారు. బంజారా మహిళా నాయకురాలికి అవకాశం కల్పించడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.
