HomeTelanganaHyderabadలోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలట్లుగైడెడ్ టూర్‌...

లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలట్లుగైడెడ్ టూర్‌…

హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోకేష్ విష్ణోయ్…నిజామాబాద్‌లోని క్రూ రన్నింగ్ రూమ్‌లో లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలట్లు మరియు రైలు మేనేజర్‌ (రన్నింగ్ స్టాఫ్)లకు అందిస్తున్న సౌకర్యాలపై గైడెడ్ టూర్‌ని శుక్రవారం నిర్వహించింది.

ఈ సందర్భంగా హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ మాట్లాడుతూ ..లోకో పైలట్‌లు రైల్వే కుటుంబంలో ముఖ్యమైన సభ్యులని, రైల్వే వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు.

రన్నింగ్‌ సిబ్బంది నిర్ధారిత డ్యూటి గమ్యాన్ని చేరిన తరువాత తదుపరి డ్యూటి ఎక్కే వరకు వారికి సరియైన విశ్రాంతిని అందించేందుకు అన్నీ సౌకర్యాలతో కూడిన రన్నింగ్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

లోకో పైలట్‌ల పని గంటలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని మరియు వారికి సమాయనుసారం ఇవ్వవలసిన విశ్రాంతిని సరైన సమయానికి ఇస్తున్నామని చెప్పారు.

అలాగే నిజామాబాద్ రన్నింగ్ రూమ్‌లో మొత్తం 27 ఎయిర్ కండిషన్డ్ రూమ్లు ఉన్నాయి.

ఈ రూమ్‌ల ద్వారా రోజుకు 60 మంది సిబ్బందికి వసతి కల్పిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. సిబ్బందికి సబ్సిడీ ధరలతో ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన భోజనం కూడా అందించబడుతుందనీ తెలిపారు.

డ్యూటీని చేపట్టే ముందు, లోకో పైలట్‌లు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ నిర్వహించి , ‘నో సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్ ’పై ప్రమాణం చేయాలి మరియు రైళ్లు సాఫీగా మరియు సురక్షితంగా నడుస్తున్నాయని నిర్ధారించడానికి వారికి అందుబాటులో ఉంచిన అన్నీ కొత్త సర్క్యులర్‌ (భద్రత) ల ను విధిగా చదవాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రైల్వే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments