HomeTelanganaNizamabadటీజీవీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీజీవీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీజీవీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్‌ ఆధ్వర్యంలో నేడు స్థానిక అమరవీరుల స్థూపం వద్ద టీజీవీపీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఆయూష్‌ బ్లడ్‌ బ్యాంకలోే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ టీజీవీపీ విద్యార్థి సంఘం 2012 జూలై 30న ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజ్‌

ఈ బ్లాకలోే పురుడు పోసుకుందని, మాలి దశ ఉద్యమంలో ”మా తెలంగాణ రాష్ట్ర మాకు కావాలి” అని పోరాడిందని గుర్తు చేశారు. కొన్ని వందల కేసులు పెట్టిన వెనుకడుగు వెయ్యకుండా ముందండి పోరాడి ప్రత్యేకరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషిచ్చిందని తెలిపారు.

2014 లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన అనంతరం ప్రభుత్వం విద్యాభివద్ధిని పక్కన పెట్టడంతో గడిచిన దశాబ్ది కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యార్థులకు జరుగుతున్న అన్యాయని బయటికికి చెప్తు కొరడాలు పెట్టిందన్నారు.

నూతనగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా విద్యార్థులని చిన్న చూపు చూస్తుందని మండి పడ్డారు. విద్యార్థులకు ఫీ రియింబర్స్‌మెంట్‌తో పాటు స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

టీజీవీపీ ఎల్లప్పుడు విద్యార్థుల కోసం ఉంటుదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అనిరుద్రజ్‌, ప్రశాంత్‌ నగారా, నాయకులు మహేష్‌, సుజిత్‌, వెంకట్‌, లడ్డూ, రాజేష్‌, ప్రణరు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments