HomeCRIMEసీసీ కెమెరాలలో రికార్డు కాకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది..రక్షిత ఆత్మహత్య వెనుక అసలు కారణాలేంటి ?

సీసీ కెమెరాలలో రికార్డు కాకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది..రక్షిత ఆత్మహత్య వెనుక అసలు కారణాలేంటి ?


రక్షిత మృతి పై పోలీసులు సమగ్ర విచారణ జరపాలి

AIPSU రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బోడ అనిల్, మన్నే కుమార్ డిమాండ్
రక్షిత ఆత్మహత్యపై సమగ్రమైన విచారణ జరిపించాలని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలలో రికార్డు కాకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుందని ఏఐపిఎస్యు విద్యార్థి సంఘం నాయకులు అన్నారు.

ఈ సందర్భంగా AIPSU రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బోడ అనిల్, మన్నె కుమార్ మాట్లాడుతూ…
అక్బర్ నగర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ హాస్టల్ నందు


విద్యార్థిని రక్షిత మృతికి గల కారణాలు తెలవకుండానే, మృతదేహన్నీ కుటుంబీకులు వచ్చేంతవరకు ఉంచకుండా, స్థానిక పోలీసులు మృతదేహాన్ని హుటాహుటిగా బోధన్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించడం చాలా దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రక్షిత ది నిజంగానే ఆత్మహత్యనా? లేక హత్య నా? పోలీసులు సమగ్ర విచారణ జరపాలని, స్థానిక ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతికి గల కారణాలను తక్షణమే మీడియా ముఖంగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments