HomeTelanganaNizamabadతడిసి ముద్దయిన ఇందూరు..జిల్లాలో కురుస్తున్న జోరువాన..పొంగి ప్రవహిస్తున్న పెద్దవాగు కప్పల వాగులు

తడిసి ముద్దయిన ఇందూరు..జిల్లాలో కురుస్తున్న జోరువాన..పొంగి ప్రవహిస్తున్న పెద్దవాగు కప్పల వాగులు

  • చెక్ డ్యాముల మీదుగా ప్రవహిస్తున్న వర్షపునీరు
  • మోర్తాడు మండలం ధర్మోరా శెట్టిపల్లి గ్రామాల మధ్య నిలిచిపోయిన రాక
  • ఆర్మూర్ నిజామాబాద్ మున్సిపాలిటీలలో జలమయమైన లోతట్టు ప్రాంతాలు
  • శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న భారీ వరద నీరు
  • స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసిన జిల్లా కలెక్టర్


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే మన జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో వర్షం జోరుగా కురుస్తుంది.

జిల్లాలో వర్షబావ పరిస్థితులను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లా వరప్రదాయిని అయిన శ్రీ రామ్ సాగర్ లోకి వరద నీరు పోటెత్తింది.

అలాగే ఆర్మూర్ డివిజన్లోని ఆయా గ్రామాల్లోని చెరువులు వరద నీటితో నిండుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గం లోని కప్పల వాగు పెద్దవాగు లలో వరద నీరు ప్రవహిస్తుంది. ఆయా గ్రామాల్లో కట్టిన చెక్ డ్యాములపై నుంచి నీరు భారీగా ప్రవహిస్తోంది. మోర్తాడ్ మండలం ధర్మోరా శెట్పల్లి గ్రామాల మధ్య అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ఆర్మూర్, నిజామాబాద్ బోధన్ మున్సిపల్ పరిధిలలో లోతట్టు ప్రాంతాలు నీటిమయమయ్యాయి.

ఆర్మూర్ పట్టణంలో కొన్ని కాలనీలలో వర్షపు నీరు ప్రవహిస్తుందని చూసిన పట్టణవాసులు వరద కాలువను తలపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఆయా మండలాల్లో స్పెషల్ ఆఫీసర్లు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కురుస్తున్న భారీ వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జిల్లాలో కురుస్తున్న జోరువాన మరో రెండు రోజులు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments