నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంగీత్ కల్చరర్స్ అకాడమీ వార్షికోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అవార్డుల ప్రధానోత్సవం ఉత్సవాన్ని నిర్వహించారు.
అందులో భాగంగా వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి అవార్డులను ప్రధానం చేశారు. చట్టం దినపత్రిక ఎడిటర్ సిరిగాథ ప్రసాద్ కి కలం యోధ అవార్డును విశిష్ట అతిథులు ప్రముఖ సినీనటి ఎస్టర్ నోరోన్హా చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో సినీ రచయిత కాసర్ల శ్యామ్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అమెరికా వాణి గడ్డం, నగర మున్సిపల్ కమిషనర్ మకరంద్, టీఎన్జీవోస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారాం,
నిజామాబాద్ డిఆర్డిఓ సాయి గౌడ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, నిజామాబాద్ జి జి హెచ్ సూపరిండెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్, సంగీత్ కల్చరల్ అకాడమీ నిర్వాహకులు, గాయని గాయకులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
