భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ •
అధికార యంత్రాంగన్ని అప్రమత్తం చేసిన- ఎమ్మెల్యే•
అత్యవసరం తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దు.
నాళాలు, డ్రైనేజీ పొంగుపొర్లుతున్నందున చిన్నారులను, వృద్దులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు •
ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులంతా చర్యలు తీసుకోవాలని కోరారు •
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు •
నిజామాబాదు నగరంలో డ్రైనేజీ పొంగిపొర్లుతున్నాయి ఇటువంటి సమయంలో త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్త తీసుకొని స్వచ్ఛమైన త్రాగు నీరు అందించేల చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు & మునిసిపల్ శాఖకు విజ్ఞప్తి చేసారు •
ఈదురు గాలుల వలన చెట్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న గృహాలలో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని,ఏవైనా ప్రమాదం జరిగే విధ్యుత్ స్తంభాలు ఉంటే వాటి వద్ద సూచికలు ఏర్పాటు చేయవలసిందిగా కరెంటు డిపార్ట్మెంట్ & మునిసిపల్ శాఖకు విజ్ఞప్తి చేశారు •
నగర ప్రజలు కూడా విధ్యుత్ స్తంబాలు తెగిపడిన విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు •
విషజ్వరాలు ప్రభాలుతున్న ఈ సమయంలో వైద్య & ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మందుల కొరత, డాక్టర్ కొరత లేకుండా చూడాలని వైద్య అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న మునిసిపల్ శానిటేషన్ సిబ్బంది నిల్వ ఉన్న వర్షపు నీటిని & కలుషిత నీటి వ్యర్థలను తొలగించాలని,కాలనిలో దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్, స్ప్రై చేయాలనీ విజ్ఞప్తి చేసారు •
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు •
నగర వాసులకు ఎటువంటి ఇబ్బంది ఉన్న నా క్యాంపు ఆఫీస్ నెంబర్ 8309038027కు అలాగే జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08462-220183 వెంటనే సమాచారం ఇవ్వగలని కోరుతున్నాం.
