ఇప్పటికే భారీ వర్షాలు అతలాకుతులం చేస్తుంటే మరోసారి వాతావరణ శాఖ మరో అలర్ట్ ప్రకటించింది . సెప్టెంబర్ 4, 5న భారీ వర్షాలు పడే అవకాశం వుందని హెచ్చరించింది .
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 6, 7, 8 తేదీల వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఈ వర్షాల కారణంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ల మీద ప్రభావం ఉంటుందని తెలిపారు.
గురువారం బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. రేపటికల్లా అప్పపీడనంగా మారే చాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ పేర్కోంది
