HomeHEALTHగురుకుల, సంక్షేమ హాస్టల్స్, కేజీబీవీ విద్యార్థులకు విష జ్వరాల నుండి కాపాడాలి..AISF నిజామాబాద్ జిల్లా...

గురుకుల, సంక్షేమ హాస్టల్స్, కేజీబీవీ విద్యార్థులకు విష జ్వరాల నుండి కాపాడాలి..AISF నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజలి, రఘురాం

అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF అధ్వర్యంలో ఈరోజు గురుకుల, సంక్షేమ హాస్టల్, కేజీబీవీ లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజలి, రఘురాం మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి వర్షాలు పడటం వలన జిల్లా వ్యాప్తంగా గురుకుల,

సంక్షేమ హాస్టల్స్, మరియు కేజీబీవీ పాఠశాల కళాశాలలో విద్యార్థులకు విష జ్వరాలు వస్తున్నాయి కాబట్టి వెంటనే అధికారులు స్పందించి విద్యార్థులకు హాస్టల్స్ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచాలని దాంతోపాటు విద్యార్థులకు అవసరమైనటువంటి మంచినీటి సౌకర్యం దాంతో పాటు మెనూ ప్రకారం భోజనాలు అందించాలని కోరడం జరిగింది.

ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో ఏఎన్ఎం, ఆర్.ఎం.పి డాక్టర్లు 24 గంటల పాటు విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్టుగా చూడాలని అన్నారు.

హాస్టల్ వార్డెన్ జిల్లా వ్యాప్తంగా సమయపాలన పాటించకుండా కాలయాపన చేస్తున్న వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలని దాంతో పాటు మెనూ పాటించని వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమాలో AISF నిజామాబాద్ నగర సహాయ కార్యదర్శి నవీన్ కృష్ణ, నాయకులు శివాజీ, స్వామి పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments