.ప్రమాదవశాత్తు నీటి కుంటల పడే వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఖానాపూర్ లో ఆదివారం చోటు చేసుకుంది.రూరల్ ఎస్ఐ ఎండి ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం…
నగరంలోని నాందేవాడ కు చెందిన సంత్పాలె జ్యోతిరామ్(54).భార్య,పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిస అయినట్టు తెలిపారు.
శనివారం ఇంటి నుంచి వెళ్లి ఖానాపూర్ శివారులో వర్షానికి నీటితో నిండిన కుంటలో మద్యం మత్తులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండి ఆరిఫ్ తెలిపారు.
