అక్రమ నిర్మణాల మీద హైడ్రా మరోసారి విరుచుక పడింది. పండగ మరుసటి రోజే ఆదివారం హైదారాబాద్ నగరంలో నాలుగు చోట్ల భారీ నిర్మాణాలను కూల్చివేస్తుంది.
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాణి నగర్, హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ సమీపంలో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి నిర్మించిన నిర్మాణాలను కూల్చేశారు .
అలాగే నిజాంపేట్ మున్సిపల్ పరిధి లో మల్లంపేట కత్వ చెరువు FTL స్థలంలో అక్రమంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ (విజయలక్ష్మి) విల్లాలను .కూల్చేస్తున్నారు.
మాదాపూర్ లో సున్నం చెరువు శిఖం లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రేకుల షెడ్ వేసి ఆక్రమించింది ఆ భారీ షెడ్ లను తొలగిస్తున్నారు. సినిమానటుడు టీడీపీ నేత మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా ముందస్తు గా నోటీసులు ఇచ్చింది.
15 రోజుల్లో నిర్మాణాలు తొలగించకపోతే కూల్చేస్తామని పేర్కొంది గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఆ సంస్థ నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే 15 రోజుల్లో తామే తొలగిస్తామని మురళి మోహన్ విజ్ఞప్తి చేయడం వల్లే హైడ్రా 15 రోజులు గడువు ఇచ్చింది. నగరంలో ఒకే రోజు హైడ్రా ఏకంగా నాలుగు చోట్ల కూల్చివేతలు చేస్తుండడంతో రియల్టర్ లలో గుబులు మొదలయ్యింది.
ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త గా ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు నిఘా వర్గాలు సైతం మోహరించాయి.
