మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుగా ఖిల్లా రోడ్డు నుంచి వెళ్ళే మార్గంలో ఆదివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ పర్యటించారు.
మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 16న మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మిలాద్ కమిటీ నిర్ణయించింది.
ఈ మేరకు నగరంలో ర్యాలి గా వెళ్ళే మార్గాలను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నగరంలోని ఊరేగింపు మార్గాలు స్పష్టంగా ఉండేలా, నిర్ణయించిన రూట్లో నుంచే ఊరేగింపు ఉండేలా చూడటానికి మత పెద్దలతో,నిర్వాహకులతో సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సానిటేషన్ అధికారులు,ఎంఐఎం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
