శనివారం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను ఎంపీ అర్వింద్ జెండా ఊపి ప్రారంభించారు .
ఖేలో ఇండియా ద్వారా నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలన్నారు .
ఈ కార్యక్రమంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అసిస్టెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కుమారి నిషా విద్యార్థి , జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు
ఈగ సంజీవరెడ్డి నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కృపాకర్ రెడ్డి , తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయకాంతరావు, వందలాదిమంది క్రీడాకారిణులు పాల్గొన్నారు.








