HomeCRIMEదొంగతనము కేసులో నిందితుడి కి 10 నెలల జైలు శిక్ష

దొంగతనము కేసులో నిందితుడి కి 10 నెలల జైలు శిక్ష

దొంగతనం కేసులో నిందితుడి మీద అభియోగాలు రుజువు కావడంతో రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీనివాసరావు నిందితునికి 10 నెలల సాధారణ జైలు శిక్ష విధించారు .2022 మార్చిలో గంగస్థాన్ -2 లోఉండే రంగప్ప గారి శంకర్ కుటుంబ సభ్యులతో సహా అవసర నిమిత్తం హైదరాబాద్ వెళ్ళగా గుర్తుతెలియని వ్యక్తులు అదే రోజు రాత్రి ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు మరియు నగదు ఎత్తుకెళ్లారు బాధితుడి పిర్యాదు మేరకు రూరల్ పోలీస్ లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ,

అదే ఏడాది మే 7 న ఎస్ఐ లింబాద్రి బైపాస్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న సమయంలో , డిచ్పల్లి మండలం నడిపల్లి కి చెందిన గణేష్ అనుమానాస్పదంగా సంచరించగా అతని పట్టుకుని విచారించగా గంగస్థాన్లో జరిగిన దొంగతనం తానే చేసినట్టు ఒప్పుకున్నాడు ,

అరెస్టు చేసి నిందితుని వద్ద నుండి దాదాపు 6 తులాల బంగారు మరియు వెండి ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్ చేసిన అనంతరం కోర్టులో సాక్షుల విచారణ అనంతరం అతడు చేసిన నేరం రుజువు దొంగతనం కేసులో నిందితుడి మీద అభియోగాలు రుజువు కావడంతో రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ,శ్రీనివాసరావు నిందితునికి 10 నెలల సాధారణ జైలు శిక్ష విధించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments