ముస్లిం ల పవిత్ర దినమైన మిలాద్- ఉన్ -నబీ పండుగ సందర్భంగా నిజామాబాద్ లో ఈ నెల 16 న భారీ ఊరేగింపు జరగనుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిజామాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఈ నెల 16న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు భారీ ఊరేగింపు కారణంగా కొన్ని మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి,దారి మళ్లింపు చేసినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనెవర్ ప్రకటించారు.
బోధన్ వైపు నుండి వచ్చే వాహనాలు అర్సపల్లి చౌరస్తా, అర్సపల్లి రైల్వే గేట్, న్యూ కలెక్టరేట్, కాలూర్ చౌరస్తా, ఖాజా హోటల్, బైపాస్, NTR చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్ళాలని పేర్కొన్నారు.
అలాగే నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్ళు వాహనాలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే ఫ్లై ఓవర్, శివాజీ చౌక్, నిజాం కాలనీ, అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బోధన్ వైపు వెళ్లాలని సూచించారు.
