HomeTelanganaNizamabadపార్టీ పదవుల మీద పెరిగిన ఆశలు ....మహేష్ ఎంట్రీ తో మారనున్న సమీకరణాలు...

పార్టీ పదవుల మీద పెరిగిన ఆశలు ….మహేష్ ఎంట్రీ తో మారనున్న సమీకరణాలు ……మారనున్న సారథులు

పీసీసీ పగ్గాలు మహేష్ కు వచ్చిన నేపథ్యంలో జిల్లా పార్టీలో సమీకరణాలు మారనున్నాయి.రాబోయే రోజుల్లో జిల్లా పార్టీలో మహేష్ ముద్ర కనిపించేలా ఉంది.

పార్టీలో కీలక మైన స్థానాల్లో మహేష్ వర్గీయులు వచ్చేలా పావులు కదులు తున్నాయి. ముఖ్యంగా పార్టీ లో కొత్త సారథులు వచ్చే అవకాశాలున్నాయి.

దాదాపు దశాబ్దకాలం పాటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా జిల్లా, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుల విషయంలో ఆయన మాటే ఫైనల్ అయింది.

కానీ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ నియామకం ఆయన నేపథ్యంలో జిల్లా పార్టీ వ్యవహారాల్లో ఆయన చక్రం తిప్పే ఛాన్స్ వుండదు. అదీగాక రాబోయే రోజుల్లో మంత్రి గా ఆయన పాలనా వ్యవహారాల్లోనే తలమునికలవ్వనున్నారు.

మరో వైపు పార్టీలో కీలక స్థానాలకు కొత్త అధ్యక్షులను నియమించడం అనివార్యంగా మారింది. డీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన మానాల మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఛైర్మెన్ గా నియామకం అయ్యారు. అలాగే దాదాపు పదేళ్ల కు పైగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడి గా పనిచేస్తున్న కేశ వేణు సైతం నుడా చైర్మెన్ గా నియామకం కానున్నారు.

ఏక కాలం లో రెండు పోస్టులు ఖాళీ అవబోతున్నాయి. ఈ ఇద్దరికి నామినేటెడ్ పోస్టు దక్కాయి. దీనితో వారి స్థానాల్లో కొత్తవారికి సారథ్య బాధ్యతలు అప్పగించడం అనివార్యం.

అందులోనూ లోకల్ బాడీ ఎన్నికల పక్రియ మొదలవుతున్నది. అందుకే వీలైనంత తొందరగా కొత్త సారథుల నియామకం జరిగే అవకాశం ఉంది. మహేష్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి జిల్లా కు వచ్చాకే ఈ పదవుల భర్తీ పక్రియ కు మొదటి అడుగు పడే ఛాన్స్ ఉంది.

డీసీసీకొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంలో అప్పుడే పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఆరుమాసాలల్లో రానున్న పంచాయితీ, మున్సిపల్, సహకార, లోకల్ బాడీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగాభావిస్తుంది.

పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగే ఈ ఎన్నికల్లో సానుకూల పలితాలు సాధించని పక్షంలో ప్రభుత్వ ప్రతిష్ట మసక బారే ప్రమాదం వుందని భావిస్తుంది. అందులోనూ మొన్నటి అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ సానుకూల ఫలితాలేవీ సాధించలేక పోయింది.

బిఆర్ యస్ బీజేపీ లతో పాటు యంఐయం పార్టీ ల ప్రాబల్యం ఎక్కవగా ఉండే జిల్లాలో ఎన్నికలను ఎదుర్కోవడం అత్యంత క్లిష్టమైన టాస్క్ గా భావిస్తున్నారు. అందుకే డీసీసీ, అర్బన్ కాంగ్రెస్ లకు సారథుల విషయంలో ఆచితూచి వ్యవహరించనున్నారు.

సామజిక ,ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నియామకాలు జరుగుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments