బాల్కొండ మండల కేంద్రంలో దారుణ హత్య జరిగింది. నాలుగు రోజుల క్రితం చిట్టాపూర్ లో మిస్సైన బాలుడి హత్య కలకలం రేపుతుంది. గత నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ ఐనా బాలుడి కథ విషాదాంతమైంది.
బాల్కోండ లోని పురాతన ఖిల్లా వద్ద కచ్చు రాకేష్ (12) దారుణ హత్యకు గురయ్యాడు. బాల్కోండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు బాను, లస్మయ్యల కుమారుడైన రాకేష్ నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ అయ్యాడు.
బాలుడి అచూకి లభించక పోవడంతో బాల్కొండ పోలీస్ స్టేషన్ లో కేసు సైతం నమోదయింది. శనివారం ఉదయం బాలుడి మృతదేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీస్ లకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. సంఘటన స్థలాన్ని సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేష్ లు పరిశీలించారు.డాగ్ స్కాడ్ ను రప్పించి పరిశోధన ప్రారంబించారు.
