అపోలో హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తున్న యువతి దారుణ హత్యకు గురైంది .
పోలీసులు మొదట అనుమానాస్పద కేసు నమోదు చేయగా తల్లిదండ్రుల పిర్యాదు మేరకు హత్య కేసు గా మార్చారు గచ్చిబౌలి రెడ్‌స్టోన్ హోటల్‌లో నర్సింగ్ చదువుతోన్న విద్యార్థిని ఓ హోటల్ లో విగతజీవిగా పడి ఉంది.
అయితే, ఇద్దరు యువకులు ఆమెను దారుణంగా హతమార్చినట్లుగా అనుమానిస్తున్నారు . కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రులు తమ కూతురిపై అత్యాచారం చేసి అత్యంత కిరాతంగా చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
