HomePOLITICAL NEWSAndhra Pradeshకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఫై లైంగిక వేధింపుల కేసు .....

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఫై లైంగిక వేధింపుల కేసు …..

జనసేన నాయకుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ అలియాస్ షేక్ జాని భాషా పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది.

జానీ తనఫై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మరో కొరియో గ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు దీనితో పోలీసులు సెక్షన్ 376 రేప్ కేసులో పాటు క్రిమినల్ బెదిరింపు(506),గాయపరచడం(323)క్లాజ్ (2) కింద కేసులు నమోదు.

చేసి దర్యాప్తు చేస్తున్నారు.రాయ దుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది.

ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసును బదిలీ చేశారు. దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లోని స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు..జానీ మాస్టర్‌పై గతంలోనూ ఓ కేసు ఉంది..

2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్‌ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.జానీ మాస్టర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరుపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments