HomeCRIMEనిమజ్జనం కు వెళ్ళి ఒకరు మృతి

నిమజ్జనం కు వెళ్ళి ఒకరు మృతి

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు శివారులోని గల పటేల్ చెరువులో సోమవారం ఉదయం వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి గల్లంతయినఘటన ఎల్లారెడ్డి పట్టణంలో జరిగింది.

11వ వార్డు కు చెందిన బుజ్జిగారి రాకేష్ (25) సోమవారం వినాయక నిమజ్జనం కోసం పటేల్ చెరువుకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి గల్లంతయ్యాడు .

ఇటీవల కురిసిన వర్షానికి చెరువులో నీటిమట్టం పూర్తిస్థాయిలో ఉండటంతో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభించకపోవడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గంటల తరబడి చెరువులో గాలింపు చేపట్టగా ఎట్టకేలకు మధ్యాహ్నం మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments