గణపతి నవరాత్రులో విశేష పూజలు అందుకునే గణపతి లడ్డు ను దక్కించుకోవడానికి పోటా పోటీ వుంటుంది.
అందుకే నిమజ్జనం నాడు ఆ లడ్డు కోసం వేలం నిర్వహించడం గణేష్ మండలి నిర్వాహకులకు అనివార్యం అయింది బాలాపూర్ తో మొదలైన వేలం లడ్డు క్రేజ్ ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో వేలంలో ఓ భక్తుడు ఏకంగా రూ.”కోటి 87లక్షలకు గణపతి లడ్డూ ప్రసాదంను దక్కించుకున్నారు.
బాలాపూర్ గణేష్ లడ్డు వేలం కన్న ముందే శనివారం మై హోమ్ బుజా లో గణపతి లడ్డు ను వేలం లో రూ 29 లక్షలు పలికింది.
