HomeCRIMEకొడుకు పుట్టిన ఆనందం ......కొద్దీ గంటలకే తండ్రి ఆత్మహత్య .......

కొడుకు పుట్టిన ఆనందం ……కొద్దీ గంటలకే తండ్రి ఆత్మహత్య …….

కొడుకు పుట్టిన సంతోషంలో ఆసుపత్రి ఖర్చుల విషయంలో భార్య తో తలెత్తిన గొడవతో మనస్తాపం చెందిన తండ్రి ఆత్మ హత్య కు పాల్పడినఉదంతం .

భిక్కనూరు మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బిక్కనూర్ చెందిన చిగుళ్ల మధు (25) కు రెండేళ్ల క్రితం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కృష్ణవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఆదివారం కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్య డెలివరీ అయ్యి పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. భర్త కు ఈ విషయం తెలియడంతో సాయంత్రం కామారెడ్డిలోని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ పుట్టిన కొడుకుని చూసుకొని సంతోషపడ్డాడు.

కానీ ఆసుపత్రి ఖర్చుల విషయం లో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మధు పుట్టిన కొడుకును తీసుకెళ్తానంటూ గొడవకు దిగాడు.

కానీ వైద్య సిబ్బంది వద్దని వారించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments