HomeCRIMEనగరంలో యువకుడిపై దాడి... వ్యక్తి రిమాండ్...

నగరంలో యువకుడిపై దాడి… వ్యక్తి రిమాండ్…

నగరంలో ఓ యువకుడిపై దాడి చేసిన ఘటన లో వ్యక్తినీ మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు.

వివరాల్లోకి వెళ్లితే.. ఆగస్ట్ 28 నగరంలోని మూడవ ఠాణా పరిధిలోని గౌతమ్ నగర్ నగర్ కు చెందిన మదు కు అదే ప్రాంతంలో ఉండే మదు కు పవన్ తో చౌరస్తా వద్ద మాట మాట జరిగింది. తాగిన మైకం లో ఉన్న పవన్ పై దాడి కి తెగబడ్డారు.

దీంతో మధు కు తీవ్ర గాయాలయ్యాయి. కన్ను భాగం చిట్లి పోవడంతో అక్కడే అపస్మారస్థితిలో పడిపోయాడు.దీనితో గాయపడిన మధు ను హుటాహుటిన నగరం లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

కానీ పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో హైదరాబాద్ రెఫర్ చేసారు. మధు కుటింబీకులు స్థానిక మూడవ రాణా పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు మంగళవారం పవన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ మహేష్ కుమార్ వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments