HomeTelanganaNizamabadక్రీడలు ఎంతో అవసరం - మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి - కమ్మరపల్లిలో క్రీడోత్సవాల...

క్రీడలు ఎంతో అవసరం – మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – కమ్మరపల్లిలో క్రీడోత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల..

మానసిక ఉల్లాసానికి,ఆరోగ్యకరమైన జీవితానికి క్రీడలు ఎంతో అవసరమని మాజి మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

కమ్మర్పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన SGF మండల అంతర పాఠశాల క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజి మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.

తదనంతరం విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాజి మంత్రి, ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ… క్రీడలు అనేవి కేవలం ఫిట్ నెస్ కోసమే కాదు..

జీవితంలో మనకు ఎదురు దెబ్బలు తగిలినపుడు వాటిని తట్టుకొని నిబ్బరంగా , మనో ధైర్యంగా ఉండటానికి క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు.క్రీడల్లో గెలుపోటములు సహజమని, అన్నింటిని సమానంగా తీసుకోవాలని సూచించారు..

క్రీడోత్సవాలను జరుపడానికి కృషి చేసిన అన్ని పాఠశాల ల ఉపాధ్యాయ బృందం ,PET బృందానికి అభినందనలు,సహకరించిన,గ్రామాభివృద్ధి కమిటీ మండల ప్రజలకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments