HomeTelanganaNizamabadఎస్సారెస్పీ 20 గేట్ల ఎత్తివేత - ఎగువ నుంచి భారీగా ప్రవహిస్తున్న వరద నీరు -...

ఎస్సారెస్పీ 20 గేట్ల ఎత్తివేత – ఎగువ నుంచి భారీగా ప్రవహిస్తున్న వరద నీరు – నిండుకుండలా మారిన జలాశయం – పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన…

ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

గత వారం క్రితం గేట్లను ఎత్తి గోదావరి లోనికి నీటిని వదిలిన అధికారులు, తిరిగి మళ్లీ నేడు 20 వరద గట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టులోకి 90,470 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా వరద గేట్ల ద్వారా 62,480 క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 6,800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,200 క్యూసెక్కులు, వరద కాలువకు 19 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం అంతే నీటి మట్టంతో నిండుకుండలా ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈఈ కొత్త రవి సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments