వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన తోమాటి ప్రియాంకకు ఐదేళ్ల క్రితం బాన్సువాడకు చెందిన సంతోష్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా కొంతకాలంగా భర్త వేధింపులు తట్టుకోలేక గురువారం తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది.
దీంతో వెంటనే తండ్రి బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మొబైల్ నంబర్ ద్వారా ట్రాక్ చేయగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించారు.
రైల్వే ఎస్సైకి సమాచారం హుటాహుటిన అక్కడికి చేరుకుని మహిళను రక్షించారు. కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
