నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ కల్మేశ్వర్ సింగెనవార్ ఆదేశానుసారంగా శుక్రవారం నిజామాబాద్ కమీషనరేటు కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు డి.సి.పి కోటేశ్వర రావు మాట్లాడుతూ సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని జీవితాంతం పోరాడినవ్యక్తి, సాయుధ పోరాట కాలంలో పెత్తందార్లను ఎదిరించిన వారికి న్యాయవాదిగా సేవలందించారని తెలిపారు.
అలాగే వారి తరపున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది అని, గాంధీజి స్ఫూర్తితో దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్పూర్తిని నిలిపారని పేర్కొన్నారు. అదేవిధంగా అనగారిన వర్గాల హక్కుల సాధన కోసం సహాకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషిచేశారని తెలియజేశారు.
ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్ తరాలకోసం అనునిత్యంప్రతి ఒక్కరు కష్టపడాలని, భావి తరాల కోసం బంగారు బాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బందికి అదనపు డి.సి.పి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శంకర్ నాయక్, ట్రాఫిక్ ఎ.సి.పి శ్రీ నారాయణ, సి.టి.సి ఎ.సి.పి శ్రీ సయ్యద్ మస్తాన్ అలీ, ఆఫీస్ సూపరింటెండెంటులు శ్రీ శంకర్, శ్రీ బషీర్, మరియు పోలీస్ కార్యాలయం సిబ్బంది సి.సి.ఆర్.బి సిబ్బంది, సి.ఎస్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
