ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే ఇంద్రాపూర్ కు చెందిన సురేష్(45).
భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.మంగళవారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
