గంజయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు రిమాండ్ చేసినట్లు రెండవ టౌన్ ఎస్ఐ యశీర్ అర్ఫత్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..
నగరంలోని బర్కత్పుర కాలనీకి చెందిన అప్రోజ్, మునిఫ్ ఖాన్ ఇద్దరు నాందేడ్ కు చెందిన కరీం నుంచి గంజాయి ని తీసుకొచ్చే నగరంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు వారినుంచి 100 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా అఫ్రోజ్ ఖాన్ గంజాయి విక్రయిస్తు పట్టుబడిన కేసులు ఉన్నట్లు తెలిపారు.
అప్రోజ్, మునిఫ్ ఖాన్ ల నుంచి మూడు సెల్ ఫోన్లు,ద్విచక్ర వాహనం సీజ్ చేసినట్లు తెలిపారు.
