HomePOLITICAL NEWSUncategorizedజిమ్ లో నిషేదిత స్టెరాయిడ్ విక్రయిస్తుం ముఠా అరెస్టు ....

జిమ్ లో నిషేదిత స్టెరాయిడ్ విక్రయిస్తుం ముఠా అరెస్టు ….

నిషేదిత స్టెరాయిడ్ లు ఇంజక్షన్ లను యువత కు విక్రయిస్తున్న ముఠా ను పట్టుకున్నారు , హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ మేరకు ముఠా వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు వీరి వద్ద భారీ మొత్తంలో ‘టెర్మిన్ (నియాన్)’ (Termin/Neon), ‘మెఫెన్ టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ మరియు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన మరియు జిమ్ శిక్షణతో సంబంధం ఉన్న ప్రధాన విక్రేతలు బట్టే శివ మరియు మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరు ఎటువంటి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్‌లైన్ ద్వారా నిషేదిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు బాడీ సప్లిమెంట్లను అక్రమంగా సేకరిస్తు అమ్మకాలు చేస్తున్నారు .’ఐరన్ హౌస్ జిమ్’ మాజీ యజమాని మరియు శిక్షకుడు, ప్రస్తుతం ఆన్‌లైన్ జిమ్ ట్రైనర్‌గా ఉన్న బట్టే శివ, మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న ‘టెర్మిన్ (నియాన్)’ మరియు ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్’ ఇంజెక్షన్లను కొనుగోలు చేస్తూన్నాడు సైట్ ద్వారా వీటిని సేకరించాడని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముడిద్ చౌహాన్ వీటిని ‘Delhivery’ కొరియర్ సర్వీస్ ద్వారా బట్టే శివ వాటిని తెచ్చి అధిక ధరకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతున్నాడన్నారు

అదేవిధంగా, 2021 నుండి జిమ్ వర్కవుట్‌లలో నిమగ్నమైన మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్, ‘Ship Racket’ అనే ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్ ద్వారా ఈ ఇంజెక్షన్లు మరియు సప్లిమెంట్లను సేకరించాడు. పంజాబ్‌కు చెందిన రాజన్ ప్రీత్ సింగ్ వీటిని ‘Blue Dart’ కొరియర్ సర్వీస్ ద్వారా పంపగా, ఫైసల్ వాటిని అధిక ధరకు విక్రయించడానికి 1) మహమ్మద్ సైఫ్ మరియు 2) ఫర్జాన్ ఖాన్‌లకు సరఫరా చేశాడు.

నమ్మదగిన సమాచారం మేరకు, సికింద్రాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం మరియు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించి, పైన పేర్కొన్న నిషేధిత పదార్థాలతో సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బట్టే శివ మరియు అతని సబ్-సెల్లర్లు (మహమ్మద్ యూసుఫ్, సోంబట్టిని అభిలాష్లపై కేసు నమోదు చేశారు.

ఈ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీ లో ఉన్నారని ఆయన చెప్పారు.ఈ ముఠా ను పట్టుకున్నవారిలో టాస్క్ ఫోర్స్ సీఐ రాజశేఖర్ ముషీరాబాద్ సీఐ రాజగోపాల్ రెడ్డిటాస్క్ ఫోర్స్ ఎస్సై లు మహేష్ గనదీప్ మణికంఠ రాజు అలాగే ముషీరాబాద్ ఎస్సై లు కెవి లక్ష్మి నారాయణ,దుర్గా చౌదరి లు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments