HomeCRIMEకడుపునొప్పి భరించలేక మహిళా ఆత్మహత్య...

కడుపునొప్పి భరించలేక మహిళా ఆత్మహత్య…

కడుపునొప్పి బరించలేక పురుగుల మందు సేవించి మహిళా ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని నాలుగోవ టౌన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పద్మనగర్ కు చెందిన కట్టా లలిత (53). కడుపునొప్పి తో, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఈనెల 27న తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోనీ బాత్రూంలోకి వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.

అది గమనించిన కుటుంబీకులు నిజామాబాద్ ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments