ఒకరి పరిస్థితి విషమం..ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఇందల్వాయి మండల పరిధిలోని దగ్గి అటవీ ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కోటగిరి మండలానికి చెందిన జల్లె వికిల్ అతని స్నేహితుడు కిరణ్ ఇద్దరు కలిసి హైదరాబాదులో ఉంటున్న వికీల్ తమ్ముడు దగ్గరికి వెళ్లారు.
తిరిగి నిజామాబాద్ కు వస్తున్న సమయంలో దగ్గి అటవీ ప్రాంతంలో వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో జల్లే వికిల్ కు తీవ్ర గాయాలయి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
అక్కడే ఉన్న కిరణ్ అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో 108 లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వికిళ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
