పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు బుదవారం మెరుపు దాడులు నిర్వహించారు.వివరాల్లోకి వెళ్లితే మాక్లూర్ మండలంలోని మామిడి పల్లి గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి రూ.52870 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే గుత్పా గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు తెలిపారు.
వారినుంచి రూ.4410 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం తొమ్మిది మంది పేకాట రాయుళ్లను మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
