జిల్లాలో పార్టీ ని బలోపేతం చేసే దిశగా యం ఐ యం వ్యూహరచన చేస్తుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత హాసదొద్దీన్ ఓవైసి ఆదివారం జిల్లాకు వస్తున్నారు.
ఆయన చాలాకాలం తర్వాత జిల్లాకు వస్తున్నారు. దీనితో క్యాడర్ లోను ఉత్సహం కనిపిస్తుంది. స్థానిక ఖిల్లా రోడ్ లో భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేసారు.
ఆ తర్వాత జిల్లాలో యంఐయం పార్టీ ఎలా బలోపేతం చెయ్యాలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇటీవలే బిఆర్ యస్ ను వీడి పార్టీలో కి వచ్చిన కొత్త నేతల్లో ఒకరికి కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు.
అసెంబ్లీ లోకసభ ఎన్నికల ప్రచారంలోనూ మొదటి సారి ఆయన జిల్లావైపు కన్నెత్తి చూడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ యస్ కు అండగా నిలిచినప్పటికి లోకసభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కి మద్దతు గా నిలిచారు.
దాదాపుగా బిఆర్ యస్ తో పదేళ్ల దోస్తానికి గుడ్ బై చెప్పేసారు. కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కానీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒంటిరిగా పోటీ చేసే ఆలోచనలో ఆ పార్టీ ఉంది.
గతంలో బిఆర్ యస్ కు మిత్ర పక్షంగానే ఉన్న సరే మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసింది. వరుసగా రెండు పర్యాయాలు అర్బన్ లో అనూహ్య ఫలితాలు సాధించింది.
60 డివిజన్ లున్న నగరంలో ముస్లిం మైనారిటీ ల ప్రాబల్యం దాదాపు 20 డివిజన్ లలో ఉంది. రెండు పర్యాయాలు 15 డివిజన్ లను గెలుస్తూ వస్తుంది. మేయర్ ఎన్నికల్లో యంఐయం పార్టీ కీలకంగా మారుతుంది.
మేయర్ ఎన్నికకు మద్దతు ఇస్తూ డిప్యూటీ మేయర్ పదవీ దక్కించుకుంటుంది. ఈసారి కూడా అదే వ్యూహం లో ఆ పార్టీ ఉంది. కానీ మైనార్టీ ల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం అనూహ్యంగా పెరిగింది. ముస్లిం ఓటర్లు గంప గుత్తగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ పరిస్థితులను అధిగమించి మైనారిటీ ఏరియాల్లో యంఐయం పట్టుకొనసాగేలా దారుస్సలాం పక్క ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అందుకే మున్సిపల్ ఎన్నికలకు ఆరు నెలల ముందే అధినేత రంగంలోకి దిగారు.
ఈపాటికే అర్బన్ లో బీజేపీ బలంగాఉంది గతమున్సిపల్ ఎన్నికలో దాదాపు మేయర్ పీఠం దాక వెళ్ళింది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
ఆ పార్టీకి అర్బన్ లో వోటు బ్యాంకు లేకుండా పోయింది. అందుకే ఏమరుపాటు గా ఉంటె మేయర్ పీఠం ఈసారి బీజేపీ ఎగురేసుకెళ్ళడం ఖాయమనే అంచనాకు యంఐయం వచ్చింది. అందుకే ముస్లిం ఏరియాల్లో తమ పట్టు చేజారితే కాంగ్రెస్ లాభం చేకూరుతుంది.
మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకొని మేయర్ ఎన్నికలో ఎప్పటిలాగే కీలకంగా ఉండాలనేది అధినేత అంతరంగంగా ఉంది.
