హైదరాబాదు సిటీ పోలీసుకు సంబంధించిన మహిళా ఉద్యోగులు హోంగార్డు స్థాయి నుంచి డిసిపి వరకు మహిళా అధికారులు అందరు సుమారు 800 మంది పాల్గోన్నారు.
మహిళా ఉద్యోగులు కలిసి వివిధ రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్క దగ్గరికి చేర్చి బతుకమ్మ పాటలను పాడుతూ, ఆడుతూ సాంప్రదాయాన్ని చాటారు.హైదరాబాదు సిటీ పోలీసు కమిషనర్ శ్సివి ఆనంద్ సతీమణి లలితా ఆనంద్ లు ముఖ్య అథితిగా హాజరయ్యారు.
ఉద్యోగులందరికి బతుకమ్మ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు .
ఈ సందర్బంగా మాట్లాడుతూ బతుకమ్మ మరియు దసరా నవరాత్రులకు హైదరాబాదు నగరంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామాన్నారు.
ఈ కార్యక్రమానికి సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ డిసిపి రక్షిత కృష్ణమూర్తి … డీసీపీ సౌత్ జోన్ స్నేహ మొహ్రా ,సైబర్ క్రైమ్ డిసిపి ధార కవిత లు పాల్గొన్నారు
