హైదారాబాద్ శివారు లో ఓ ఫామ్ హౌస్ లో దోపిడీ హత్యలు కలకలం రేపాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధి లో .కందుకూరు మండలం కొత్తగూడ లో చోటుచేసుకుంది.
కందుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ లో ఫామ్ హౌస్ లో నాగర్ కర్నూల్ జిల్లా ముష్టిపెళ్లికి చెందిన ఉషయ్య (55), శాంతమ్మ (50)లుగా పనిచేస్తున్నారు. వీరు బతుకుదెరువు కోసం వచ్చి కొన్ని రోజులుగా
ఈ వ్యవసాయక్షేత్రంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, మంగళవారం అర్ధ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఫామ్ హౌస్ లో ఉన్న వారిపై దాడి చేసి..
దారుణంగా హతమార్చారని పోలీసులు తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
