బాత్ రూమ్ లో పడి యువకుడు మృతి చెందిన ఘటన భీమ్ గల్ మండలం లో చోటు చేసుకుంది.రాజస్థాన్ కు చెందిన రాజు(20).రాజు అతని స్నేహితులతో కలిసి గత కొన్ని రోజులుగా భీమ్ గల్ మండల కేంద్రంలో రూమ్ కిరాయికి తీసుకొని ఉంటున్నారు.
వీరు అందరూ కలిసి మండలం లోని పలు ప్రాంతాల్లో మార్బుల్ టైల్స్ పనులు చేస్తారు. ఈ మేరకు శనివారం రాత్రి అతనికి స్నేహితులు వంట సరకు తీసురవడానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లి చూడగా బాత్ రూమ్ లో పడి ఉన్నాడని తెలిపారు.
హుటాహుటిన భీమ్ గల్ ఆసుపత్రికి తరలించారు.మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
