మద్యం మత్తులో యాసిడ్ సేవించి హోంగార్డు మృతి చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. నగరంలోని సారంగాపూర్ కు చెందిన చిన్నయ్య(39). భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ నెల 16 న మద్యం మత్తులో నిద్ర లేచి యాసిడ్ సేవించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబీకుల హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్థ రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
