HomeTelanganaNizamabadఉద్యోగ, ఉపాధ్యాయులపాత పెన్షన్ విధానం అమలు చేయాలి..

ఉద్యోగ, ఉపాధ్యాయులపాత పెన్షన్ విధానం అమలు చేయాలి..

ఉద్యోగ, ఉపాధ్యాయులనుపాత పెన్షన్ విధానం అమలు చేయాలి..2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితిఉద్యోగ, ఉపాధ్యాయులనుపాత పెన్షన్ విధానం అమలు చేయాలనీ 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీగా నియామకమైన తర్వాత మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన కోదండరామ్ ని 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆలస్యంగా పోస్టింగ్ లు ఇవ్వడం వలన దాదాపు 9000 ల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ విధానం లోకి వచ్చారని తెలిపారు.

ఇలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి మెమో 57 ఆధారంగా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు చేయాలని సూచించింది.

దేశం లోని అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా 2003 ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయని, రాష్ట్రంలో కూడా అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు రవింధర్, విజయ్ కుమార్, గుత్ప ప్రసాద్, సురేందర్, శ్రీహరి, రామకృష్ణ, ప్రవీణ్ రెడ్డి, గంగాధర్, శ్రీధర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments