రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు.ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దిష్టి బొమ్మ దహనం చేశారు.
అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..వానాకాలం సీజన్‌కు రైతు భరోసా అందజేయడం వీలుకాదని బూర్గుల రామకృష్ణారావు భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు ఏడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం ప్రభుత్వానికి మంచిది కాదని విమర్శించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా అందజేస్తామని చెప్పి ఇప్పుడు రైతులను మోసం చేసిందని విమర్శించాడు.
అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తడి బట్టలతో రైతుల గొంతు కొస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రూ 80 వేల కోట్లు అప్పు తెచ్చి రైతులకు 7 వేల కోట్ల పెట్టుబడి సహాయం చేయలేవా లేక కమిషన్లు రావనే రైతుబందు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు.రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
వెంటనే రైతు భరోసా అందజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రూ. రెండు లక్షల రుణమాఫీ, రూ. 500 బోనస్, మహిళలకు గృహలక్ష్మి పథకం, రైతు కూలీలకు రూ. 12 వేలు, నిరుద్యోగులకు జీవన భృతి అమలు చేయడంలో ప్రభుత్యం విఫలం అయ్యిందని ఎద్దేవ చేశారు.అలాగే హైడ్రా పేరుతో ప్రభుత్యని పక్కదారి పట్టిస్తున్నారనీ పేర్కొన్నారు.
రేవంత్ సర్కార్ డిల్లీకి ట్రీపులు వేసి ప్రజలకు తిప్పలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనిదని ఆగ్రహించారు.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేవరకు బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం ఉవ్వెత్తున చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
