రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల గల గుర్తు తెలియని వ్యక్తి సిర్నపల్లి ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు 8712658591 ఫోన్ చేసి సమాచారం అందించాలని రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
