HomePOLITICAL NEWSArmoorఎస్సారెస్పీ పన్నెండు గేట్లు ఎత్తివేత

ఎస్సారెస్పీ పన్నెండు గేట్లు ఎత్తివేత

-నిండుకుండల మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
-ఎగువ నుంచి భారీగా వస్తున్న ఇన్ఫ్లో

  • పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన అధికారులు

జాన రమేష్ :ఇది సంగతి: ఆర్మూర్: ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయిలో ఉండడంతో నిండు కుండలా మారింది. దీంతో ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 12 ఎత్తి గోదావరి నీటిలోనికి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 191 అడుగులు కాగా ఎగువ నుంచి 46వేల 942 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది.

ఎగువన ఏ స్థాయిలో వరదనీరు వస్తుందో అదే స్థాయిలో దిగువన గోదావరి నదిలోనికి 12 గేట్లని ఎత్తివేసి నీటి విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు పశువుల కాపరులు వరద నీరు గోదావరిలోనికి వదులుతున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఎస్సారెస్పీ అధికారులు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments