కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అడుగడుగునా అవమానం, అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం నగరంలోని టీఎన్జీవో భవన్లో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నమని ఆయన పేర్కొన్నారు.
ఉద్యమకారులను గత పదేళ్లుగా కేసీఆర్ మోసం చేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.కేసీఆర్ కేవలం తన రాజకీయ స్వలాభం కోసం ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు.
అలాగే ఎంతో మంది యువకులు,విద్యార్థులు,ఉద్యోగులు బలిదానాలు చేయడంతో తెలంగాణ సిద్ధించిందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఆ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అన్నారు.
ఈ సమావేశంలో అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్,జేఏసీ నాయకులు భాస్కర్,రాష్ట్ర ఉన్నత ఉద్యోగస్తుల చైర్మన్ లింబద్రి,దేవరం, టిజెఎస్ నాయకులు రతన్ రావు,జేఏసీ నాయకులు పోషెట్టి తదితరులు పాల్గొన్నారు.
