HomeHEALTHనవజాత శిశువు ను శిశు గృహ సిబ్బందికి అప్పగింత ..

నవజాత శిశువు ను శిశు గృహ సిబ్బందికి అప్పగింత ..

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ నవజాత శిశువు ను సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ శిశు గృహ సిబ్బందికి అప్పగించారు.ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ కి చెందిన ఒక మైనర్ బాలిక క్రిటికల్ స్టేజ్ లో రావటం జరిగిందని,

తనతో ఎవరు అటెండర్లు లేకపోయిన, ట్రీట్మెంట్ ఇచి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ క్రిటికల్ స్టేజ్ లో రావటం వల్ల బ్రతికించలేకపోయామనీ పేర్కొన్నారు. ఆమె ఒక శిశువు కి జన్మనిచ్చి పరిస్థితి విషమించడంతో మరణించిందన్నారు.

శిశువు కి శ్వాస సమస్య వల్ల (46) రోజులు ఎన్ ఐ సి యు లో ఉంచి కాపాడడం జరిగిందన్నారు. కొన్ని కారణాలవల్ల ఆ మైనర్ బాలిక భర్తని పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు.

అనాధగా మిగిలిన ఆ శిశువుని మానవతావాదంతో సూపరింటెండెంట్ “ఆకర్ష” అని నామకరణం చేసి శిశు గృహ సిబ్బంది కి అందజేశారు. దీనికి సంబంధించిన కేసు పోలీసుల దర్యాప్తులో ఉందని ఆమె తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments